తిరుమల ఎక్స్‌ప్రె్‌సలో పోలీసు తనిఖీలు

ABN , First Publish Date - 2021-11-09T05:54:13+05:30 IST

గంజాయి, మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా సోమవారం సాయంత్రం కడప నుంచి విశాఖపట్నం వెళ్తున్న తిరుమల ఎక్స్‌ప్రె్‌సలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కడప రైల్వేస్టేషనలో పరివర్తన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఎస్పీ కేకేఎన అన్బురాజన తనిఖీలు చేపట్టారు.

తిరుమల ఎక్స్‌ప్రె్‌సలో పోలీసు తనిఖీలు
కడప రైల్వేస్టేషనలో తనిఖీ చేస్తున్న ఎస్పీ కేకేఎన అన్బురాజన

కడప(క్రైం), నవంబరు 8: గంజాయి, మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా సోమవారం సాయంత్రం కడప నుంచి విశాఖపట్నం వెళ్తున్న తిరుమల ఎక్స్‌ప్రె్‌సలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కడప రైల్వేస్టేషనలో పరివర్తన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఎస్పీ కేకేఎన అన్బురాజన తనిఖీలు చేపట్టారు. స్థానిక పోలీసులు, ఆర్పీఎఫ్‌ పోలీసులు, పోలీసు జాగిలాలతో కలిసి సమష్టిగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు జాగిలాల ద్వారా రైల్వే మెయిల్‌ సర్వీస్‌ ఆఫీస్‌, పార్సిల్‌ ఆఫీస్‌ లగేజ్‌ ట్రాలీలలోని పార్శిళ్లను క్షుణ్ణంగా చెక్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి పరివర్తన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రత్యేక దాడులు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు సంబంఽధించి పాత నేరస్తులను గుర్తించి హెచ్చరించామన్నారు. జిల్లాను గంజాయి మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎస్పీతోపాటు కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి, వనటౌన సీఐ సత్యనారాయణ, ఆర్పీఎఫ్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:54:13+05:30 IST