వరిసాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-10-30T05:15:06+05:30 IST

రైతులు వరిసాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ ఏడీఏ శ్రీలత తెలిపారు.

వరిసాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

సంబేపల్లె, అక్టోబరు29: రైతులు వరిసాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ ఏడీఏ శ్రీలత తెలిపారు. శుక్రవారం గున్నికుంట్ల గ్రామంలో వరిపొలాలను వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  ఇందులో భాగగా వరి పంటలో సుడిదోమ అధికంగా ఉందని రైతు సోదరులకు తెలిపారు. సుడిదోమ ఆశించిన పొలాలకు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సుడిదోమ ఆశించిన పొలాలలో పాయలు తొక్కడం, పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి ప్రతి మూడు అడుగులకు పాయలు తొక్కి దోమ ఆశించిన చోట మొదలు భాగంలో బాగా తడిచే విధంగా మందులు పిచికారీ చేయాలన్నారు. సుడిదోమ తీవ్రత ప్రారంభ దశలో బూప్రోపెజిస్‌ 1.6 మి.లీ లీటరు నీటికి చొప్పున 320 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలానికి పిచికారీ చేయాలని తెలియజేశారు. సుడిదోమ తీవ్రత ఎక్కువుగా ఉన్నట్లయితే పైమెట్రోజైస్‌ 0.6 గ్రాములు లీటరు నీటికి చొప్పున 120 గ్రాములు 200 లీటర్ల నీటికి ఎకరా పొలానికి పిచికారీ చేయాలని తెలియజేశారు. డైనోటేప్యూరాన్‌ 20ఎస్‌జీ 0.4 గ్రాములు లీటరు నీటికి చొప్పున 80 గ్రాములు 200 లీటర్ల నీటికి ఎకరా పొలానికి పిచికారీ చేయాలని తెలియజేశారు. ఏవో వెంకటమోహన్‌, గ్రామ వ్యవసాయ సహాయకురాలు లక్ష్మీభవాని, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:15:06+05:30 IST