చేనేత కార్మికులకు ఫొటో గుర్తింపుకార్డులు
ABN , First Publish Date - 2021-03-26T04:55:08+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29 వ తేదీ (సోమవా రం) నుంచి జిల్లాలోని చేనేత కార్మికులకు ఉచితంగా ఫొటో గుర్తింపు కార్డులను అందచేస్తుందని చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయసంచాలకులు అప్పాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కడప (మారుతీనగర్), మార్చి 25 : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29 వ తేదీ (సోమవా రం) నుంచి జిల్లాలోని చేనేత కార్మికులకు ఉచితంగా ఫొటో గుర్తింపు కార్డులను అందచేస్తుందని చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయసంచాలకులు అప్పాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని మండలాలు, గ్రామాల వారీగా సంబంధిత సచివాలయాలల్లో అందచేస్తారన్నారు. ఫొటో గుర్తింపు కార్డుల నిర్వహణ బాధ్యతను హైదరాబాదుకు చెం దిన కార్వే డేటా మేనేజ్‌మెంట్ సంస్థకు ప్రభుత్వం అప్పగించిందని ఆ సంస్థ జిల్లాలో సెన్సెస్ సర్వే పూర్తి చేసి కార్డులు ఉచితంగా జారీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కాగా ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేసే సమయంలో చేనేతకార్మికులు ఎవ రికీ డబ్బులు చెల్లించనవసరం లేదన్నారు. ఆయా సచివాలయాల్లో తెలియచేసిన తేదీ ల్లో మీ ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపుకార్డు చూపించి ఉచితంగా గుర్తింపు కార్డు పొందాలని సూచించారు.