పెట్రో, గ్యాస్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-08-28T05:19:29+05:30 IST

పెట్రోలు, డీజలు గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు కడప అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పెట్రో, గ్యాస్‌ ధరలు తగ్గించాలి

టీడీపీ ఆధ్వర్యంలో రేపు నిరసన ర్యాలీ

కడప అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు 

కడప, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): పెట్రోలు, డీజలు గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు కడప అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ వైపు కరోనాతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతుంటే జగన్‌ ప్రభుత్వం ధరలు పెంచి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం అన్యాయమన్నారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు శనివారం రాష్ట్ర టీడీపీ పిలుపు మేరకు శనివారం ఉదయం 11 గంటలకు టీడీపీ జిల్లా కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ మీదుగా కోటిరెడ్డ్డిసర్కిల్‌ వరకు నిరసన ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్‌, కడప పార్లమెంటు ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, మాసా కోదండరామ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T05:19:29+05:30 IST