సమర్థవంతంగా విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-12-10T04:22:44+05:30 IST

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సూచించారు.

సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్‌

స్పెషల్‌ పార్టీ సిబ్బందికి రిఫ్రెషర్‌ కోర్సు ప్రారంభించిన ఎస్పీ 

కడప (క్రైం), డిసెంబరు 9 : వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సూచించారు. గురువారం నగరంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయం వద్ద ఉన్న పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో స్పెషల్‌ పార్టీ సిబ్బందికి ప్రత్యేకంగా రూపొందించిన రిఫ్రెషర్‌ కోర్సును ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిఫ్రెషర్‌ కోర్సులను స్పెషల్‌ పార్టీ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమస్యలుంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. నిరంతరం విధుల్లో ఉండే సిబ్బంది విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ సభ్యులతో గడపాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) ఎం.దేవప్రసాద్‌, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, ఆర్‌ఐ వీరేష్‌, ఆర్‌ఎ్‌సఐలు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-10T04:22:44+05:30 IST