ఉపాధి కూలీలకు పెండింగు వేతనాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-07-09T04:58:24+05:30 IST
ఉపాధి కూలీలకు పెండింగు వేతనాలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు సుబ్రహ్మణ్యం, అన్వేష్, పులి క్రిష్ణమూర్తి అన్నారు.

పోరుమామిళ్ల, జూలై 8: ఉపాధి కూలీలకు పెండింగు వేతనాలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు సుబ్రహ్మణ్యం, అన్వేష్, పులి క్రిష్ణమూర్తి అన్నారు. గురువారం అంబేడ్కర్ భవన్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ
ఉపాధి కూలీలను ఎస్సీ ఎస్టీ ఇతరులుగా విభజించి వేతనాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమన్నారు. జిల్లాలో రూ.65 కోట్లు ఉపా ధి పనులకు సంబంధించి చెల్లించాల్సి ఉందని, వాటిని వెంటనే చెల్లించాలన్నారు. సమావేశంలో వీరయ్య, సీఐటియు జిల్లా కమిటి సభ్యులు ప్రవీణ్, కదిరి గురయ్య, సత్తార్, విజయమ్మ, యోహాను,సుదర్శన్ పాల్గొన్నారు.