అగ్నికి ఆహుతైన వేరుశనగ వామి

ABN , First Publish Date - 2021-03-23T04:46:06+05:30 IST

మండలంలోని గుండ్లచెరువు పంచాయతీ అమ్మగారిపల్లెకు చెందిన రైతులు ఎద్దుల రమణయ్య, నాయుడుల వేరుశనగ వామి అగ్నికి ఆహుతైంది.

అగ్నికి ఆహుతైన వేరుశనగ వామి
కాలిపోతున్న వేరుశనగ వాములు

గాలివీడు, మార్చి 22: మండలంలోని గుండ్లచెరువు పంచాయతీ అమ్మగారిపల్లెకు చెందిన రైతులు ఎద్దుల రమణయ్య, నాయుడుల వేరుశనగ వామి అగ్నికి ఆహుతైంది. బాధితుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. ఎద్దుల రమణయ్య, నాయుడులు రబీ సీజన్‌లో వేరుశనగను సాగు చేశారు. ఈ ఏడాది వేరుశనగ పంట ఆశాజనకంగా ఉందని, వేరుశనగ కట్టెను పెరికి కాయలను కోయకుండా అలాగే వామి వేశామని తెలిపారు. ఇంతలోనే వేరుశనగ వామికి సమీపంలో కొండకు నిప్పు పెట్టడంతో కొండ కాలుకుంటూ వచ్చి తమ వాములకు కూడా అంటుకున్నదని తెలిపారు. దాదాపుగా ఒక్కొక్క రైతు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2021-03-23T04:46:06+05:30 IST