అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లరుపై పీడీ యాక్టు నమోదు

ABN , First Publish Date - 2021-02-07T04:48:49+05:30 IST

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లరుపై పీడీ యాక్టు నమోదు

కడప (క్రైం), ఫిబ్రవరి 6 : అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. ప్రొద్దుటూరు టౌన్‌కు చెందిన ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి గత ఎనిమిది సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడన్నాడు. 2014 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అతడిపై 64 కేసులు నమోదయ్యాయన్నారు. ఇతడిపై గతంలో కూడా పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపామన్నారు. జైలు నుంచి వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని తెలిపారు. తమిళనాడు నుంచి కూలీలను తీసుకువచ్చి జిల్లాలోని అట్లూరు, వీరబల్లె, గువ్వలచెరువు ఘాట్‌, సుండుపల్లె ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలను నరికించి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడని తెలిపారు. అతడిని అరెస్టు చేసి పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడినా, అటువంటి వారికి సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-02-07T04:48:49+05:30 IST