ఆన్‌లైన్‌ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-05-31T04:31:40+05:30 IST

మండల వ్యాప్తంగా ప్రజలు కరెంటు బిల్లులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని ట్రాన్స్‌కో ఏఈ రాజేష్‌ ఆదివారం తెలిపారు.

ఆన్‌లైన్‌ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించాలి

సంబేపల్లె, మే30: మండల వ్యాప్తంగా ప్రజలు కరెంటు బిల్లులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని ట్రాన్స్‌కో ఏఈ రాజేష్‌ ఆదివారం తెలిపారు. గూగుల్‌, ఫోన్‌పే తదితర ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కరెంటు బిల్లులు లక్షల రూపాయలు పెండింగ్‌ ఉన్నాయని సహకరించి త్వరగా బిల్లులు చెల్లించాలని తెలిపారు.  చెల్లించని కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.  అధికారులు సహకరించాలని చెల్లించాలని కోరారు. 

Updated Date - 2021-05-31T04:31:40+05:30 IST