ప్యాసింజర్‌ రైళ్లను ఆపాలి : వైసీపీ

ABN , First Publish Date - 2021-12-29T04:56:17+05:30 IST

స్థానిక రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్‌ రైళ్లను ఆపాలని వైసీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం స్టేషన్‌ మాస్టర్‌కు వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ ప్రసాద్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఉత్తమారెడ్డిలు మాట్లాడారు.

ప్యాసింజర్‌ రైళ్లను ఆపాలి : వైసీపీ

కమలాపురం(రూరల్‌), డిసెంబరు 28: స్థానిక రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్‌ రైళ్లను ఆపాలని వైసీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం స్టేషన్‌ మాస్టర్‌కు వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ ప్రసాద్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఉత్తమారెడ్డిలు మాట్లాడారు. పదిరోజుల్లో కమలాపురం, కొండాపురం, నందలూరు రైల్వేగేటులలో రైళ్లను ఆపకపోతే ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో కడప ఎంపీతో పాటు జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట ఎమ్మెల్యేలతో కలిసి పెద్దఎత్తున రైలు రోకో, ధర్నా చేపడుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మార్పూరి మేరీ, వైస్‌ చైర్మన్‌ సాధిక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ ఎంవీ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-29T04:56:17+05:30 IST