బస్టాండ్‌లో ప్రయాణికుడు మృతి

ABN , First Publish Date - 2021-01-21T05:01:45+05:30 IST

మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుడు బుధవారం మృతి చెందాడు.

బస్టాండ్‌లో ప్రయాణికుడు మృతి
మృతి చెందిన మల్లికార్జున

మైదుకూరు, జనవరి 20: మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుడు బుధవారం మృతి చెందాడు. అతడి జేబులో ఉన్న ఉన్న ఓటరు కార్డు ప్రకారం శ్రీశైలం వాసి కె.మల్లికార్జునగా గుర్తించారు. అతడి వద్ద లభించిన ఫోన్‌ నెంబర్ల ద్వారా బంధువులకు తెలియచేశారు. ఎలా చనిపోయింది తెలియాల్సి ఉంది. ఈ మేరకు మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 


విష ద్రావణం తాగి యువకుడు మృతి


రైల్వేకోడూరు రూరల్‌, జనవరి 20: శెట్టిగుంట పంచాయతీ పెద్దపాడులో ఈనెల 18వ తేదీ విషద్రావణం తాగిన బండి ఉదయకుమార్‌ (20) అనే యువకుడు బుధవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ రెడ్డి సురేష్‌ తెలిపారు. బండి రాజు కుమారుడు బండి ఉదయకుమార్‌ మద్యానికి బానిసై మద్యం మత్తులో విషద్రావణం తాగి మృతి చెందినట్లు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


బస్సు ఢీకొని స్కూటరిస్టు మృతి : మరొకరికి గాయాలు


రేణిగుంట, జనవరి 20: రేణిగుంట మండలం మామండూరు వద్ద బుధవారం రాత్రి బస్సు ఢీకొని స్కూటరిస్టు సురేష్‌కుమార్‌ (35) మృతిచెందగా, సాయి గాయపడ్డారు. కడపజిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరవారిపల్లెకు చెందిన సురేష్‌కుమార్‌, సాయి రేణిగుంట నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమం లో మామండూరు వద్ద ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన సాయిని తిరుపతి రుయాస్పత్రికి తరలిం చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయాస్పత్రికి తరలించి రేణిగుంట ఎస్‌ఐ సునీల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును గుర్తించడానికి చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-01-21T05:01:45+05:30 IST