బండలాగుడు పోటీల్లో పాలూరు ఎద్దులకు ప్రథమస్థానం

ABN , First Publish Date - 2021-01-14T04:49:51+05:30 IST

స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు.

బండలాగుడు పోటీల్లో పాలూరు ఎద్దులకు ప్రథమస్థానం

ముద్దనూరు జనవరి 13: స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ప్రథమస్థానంలో పాలూరుకు చెందిన ఎద్దులు నిలిచాయి. ఎస్‌వీఆర్‌ ట్రాన్స్‌పోర్టు అధినేత వరదారెడ్డి, గురుట్రాన్స్‌పోర్టు అధినేత గుర్రప్ప ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. వరదారెడ్డి, మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. పాలూరు చెందిన రాచమల్లు విజయభాస్కర్‌రెడ్డి ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచి రూ.20వేలు, వెలుగోడుకు చెందిన అయూబ్‌బాష ఎద్దులు ద్వితీయస్థానంలో నిలిచి రూ.15వేలు, కొల్లూరు గ్రామానికి చెందిన తుమ్మలూరు విజయభాస్కర్‌రెడ్డి ఎద్దులు తృతీయ స్థానంలో నిలిచి రూ.10వేలు గెలుచుకున్నాయి. మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి, వరదారెడ్డి, గుర్రప్పలు బహుమతులు అందజేశారు.

Updated Date - 2021-01-14T04:49:51+05:30 IST