విద్యార్థులను ఆకట్టుకున్న ఓపెన్‌హౌస్
ABN , First Publish Date - 2021-10-29T05:11:08+05:30 IST
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక టుటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన ఓపెన్‌హౌస్ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 28 : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక టుటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన ఓపెన్‌హౌస్ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంలో విద్యార్థులకు పోలీసు అయుధాలు, పరికరాల వినియోగం, పనితీరుపై అవగాహక కల్పించారు. మరీ ముఖ్యంగా పోలీసు జాగిలాల ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆబ్బురపరిచింది. ఇదిలా ఉండగా ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు, టుటౌన్ సీఐ నరసింహరెడ్డి, ఏఆర్ పోలీసు అధికారులు పోలీసు అయుధాలు, పరికరాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా తెలియజేశారు. వాటిని వివిధ సందర్భాల్లో వ ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియజేశారు. కార్యక్రమానికి పట్టణంలోని వివిధ పాఠశాలల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు హజరుకాగా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.