విద్యుత్‌ చార్జీల పెంపుపై దశలవారీ ఉద్యమాలు

ABN , First Publish Date - 2021-10-08T04:36:06+05:30 IST

విద్యుత్‌ చార్జీల పెంపును నిరసి స్తూ టీడీపీ దశల వారీ ఉద్యమాలు చేపడుతుందని ఆ పార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేర్కొ న్నారు.

విద్యుత్‌ చార్జీల పెంపుపై   దశలవారీ ఉద్యమాలు

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 7 : విద్యుత్‌ చార్జీల పెంపును నిరసి స్తూ టీడీపీ దశల వారీ ఉద్యమాలు చేపడుతుందని ఆ పార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేర్కొ న్నారు. గురువారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం కష్టంగా ఉంటే, జగన్‌ సర్కార్‌ ఈ రెండేళ్లలో ఆరు సార్లు విద్యుత్‌ చార్జీలను పెంచిందన్నారు. ఈ క్రమంలోనే  ఈనెలలో దశల వారీగా ఉద్యమాలను చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా పదో తేదీ వరకు  ప్రజలను చైత న్యం చేయడం, 11 నుంచి 17 వరకు మండల, గ్రామస్థా యిలో అయా కమిటీలతో సమావేశమై విద్యుత్‌ చార్జీల పెంపుపై తీర్మానం చేయడం, 18 నుంచి 24 వరకు నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలు కనీసం ఏడు గ్రామాల్లో పర్యటించి చార్జీల పెంపు గురించి ప్రజలకు వివరించడం 25 నుంచి 31 వరకు జోనల్‌, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమాలలో టీడీపీ నా యకులు, కార్యకర్తలు  పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు సుబ్బరాజు, నాగరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-08T04:36:06+05:30 IST