పాత ఉపాధ్యాయులే కావాలి

ABN , First Publish Date - 2021-01-21T05:11:43+05:30 IST

మండల పరిధిలోని మార్గోపల్లె ప్రాథమిక పాఠశాలలో గ్రామ మాజీ సర్పంచ్‌, పాఠశాల కమిటీ చైర్మన్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు.

పాత ఉపాధ్యాయులే కావాలి
మార్గోపల్లెలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

చిట్వేలి, జనవరి20 : మండల పరిధిలోని మార్గోపల్లె ప్రాథమిక పాఠశాలలో గ్రామ మాజీ సర్పంచ్‌, పాఠశాల కమిటీ చైర్మన్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఇతర పాఠశాలకు ఉపాధ్యాయులు ప్రసన్నకుమార్‌, రహంతుల్లా బదిలీ పై వెళ్లారు. కానీ ఆ ఉపాధ్యాయులే తమ పాఠశాలకు కావాలని గ్రామస్థులు నిరసన వ్యక్తంచేశారు. మాజీ సర్పంచ్‌ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులనే కొనసాగించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. పాఠశాల కమిటీ చైర్మన్‌ చెంగల్‌రాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రామప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:11:43+05:30 IST