శ్రీవారి ఆలయానికి ఎన్‌ఆర్‌ఐ విరాళం

ABN , First Publish Date - 2021-05-06T04:51:30+05:30 IST

శిథిలావస్థ దశలో ఉన్న శ్రీవారి ఆలయ పునర్‌ నిర్మాణానికి డాక్టర్‌ రాంప్రసాద్‌రెడ్డి (ఎన్‌ఆర్‌ఐ) రూ.1,16,116 విరాళాన్ని అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

శ్రీవారి ఆలయానికి ఎన్‌ఆర్‌ఐ విరాళం
విరాళాన్ని అందజేస్తున్న దృశ్యం

గాలివీడు, మే 5: శిథిలావస్థ దశలో ఉన్న శ్రీవారి ఆలయ పునర్‌ నిర్మాణానికి డాక్టర్‌ రాంప్రసాద్‌రెడ్డి (ఎన్‌ఆర్‌ఐ) రూ.1,16,116 విరాళాన్ని అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గాలివీడు మండల కేంద్రంలోని పెద్దూరు బ్రాహ్మణవీధిలో ఉన్న శ్రీవారి ఆలయం పునర్‌నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయానికి తన వంతు సహకారంగా కాల్వపల్లె ఎర్రంరెడ్డి (విశ్రాంత ఉపాధ్యాయులు) కుమారుడు అమెరికాలో ఉన్న డాక్టర్‌ ఎర్రంరెడ్డి రాంప్రసాద్‌రెడ్డి రూ.1,16,116 నగదును విరాళంగా పంపించారు. నగదును ఆయన సోదరుడు కె. మురళీధర్‌రెడ్డి, మదన్‌, పర్వతరెడ్డి చేతుల మీదుగా బుధవారం ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జీవీ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు సుబ్బరాయుడు, రామక్రిష్ణారెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T04:51:30+05:30 IST