రెండో రోజు జోరుగా నామినేషన్లు

ABN , First Publish Date - 2021-02-08T05:44:20+05:30 IST

రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు ఆదివారం జోరుగా సాగింది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.

రెండో రోజు జోరుగా నామినేషన్లు
రైల్వేకోడూరు నామినేషన్‌ కేంద్రం వద్ద నామినేషన్‌ వేయడానికి వచ్చిన అభ్యర్థులు

అభ్యర్థుల వెంట నడిచి నామినేషన్లు వేయించిన నేతలు 

రాజంపేట, ఫిబ్రవరి7 : రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు ఆదివారం జోరుగా సాగింది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల నియోజకవర్గ నేతలు తమ అభ్యర్థులను ప్రోత్సాహపరుస్తూ నామినేషన్లు దాఖలు చేయించారు. రాజంపేట టీడీపీ ఇనచార్జి బత్యాల చెంగల్‌రాయులు, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సొంత మండలమైన నందలూరులోని టంగుటూరు, ఇతర ప్రాంతాలకు స్వయంగా వెళ్లి అభ్యర్థులచే నామినేషన్లు వేయించి ప్రచారం కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి నందలూరు మండలంలో ప్రధానంగా తమ సొంత పంచాయతీ ఎర్రజెరువుపల్లెలో తమ సోదరుడు మేడా రాజశేఖర్‌రెడ్డితో నామినేషన దాఖలు చేయించారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తమ పార్టీ సానుభూతి అభ్యర్థులతో సమావేశం నిర్వహించి నామినేషనలు వేయించారు. కోడూరు టీడీపీ ఇనచార్జి కస్తూరి విశ్వనాధనాయుడు చిట్వేలి మండలం నక్కపల్లెలో తమ పార్టీ సానుభూతిపరులచే నామినేషన్లు వేయించారు. ఎన్నికల అబ్జర్వర్‌ రంజితబాషా, డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. 


భారీ ఎత్తున నామినేషన్లు  

రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ భారీ ఎత్తున సాగింది. సాయంత్రం ఐదు గంటల్లోపు వెళ్లిన అభ్యర్థులకు రాత్రి వరకు నామినేషన్లు వేయించారు. రెండు నియోజకవర్గాల్లో రెండవ రోజు నామినేషన్లు పూర్తయ్యే నాటికి 189 సర్పంచ అభ్యర్థి స్థానాలకు 742 నామినేషన్లు దాఖలయ్యాయి. 1903 వార్డు స్థానాలకు 1975 నామినేషన్లు దాఖలయ్యాయి. 


ఇప్పటివరకు మండలాల వారీ నామినేషన్లు

మండలం పంచాయతీలు వార్డులు

సర్పంచులు నామినేషన్లు వార్డులు నామినేషన్లు

రాజంపేట 25 76 242 231

నందలూరు 11 58 120 124

ఒంటిమిట్ట 13 61 130 130

సిద్దవటం 18 80 168 195

సుండుపల్లె 10 39 114 97

వీరబల్లి 12 64 130 179

రైల్వేకోడూరు 21 107 232 290

చిట్వేలి 21 67 200 238

పెనగలూరు 16 75 162 232

ఓబులవారిపల్లె 22 70 219 138

పుల్లంపేట 20 45 126 128

మొత్తం 189 742 1903 1982


Updated Date - 2021-02-08T05:44:20+05:30 IST