నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-08-10T09:53:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని సోమవారం కడప కలెక్టరేట్‌ వద్ద కార్మిక సంఘాలు, వామపక్షాల ఆఽధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
కలెక్టరేట్‌ ముందు నిరసన తెలుపుతున్న వామపక్షాలు

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దారుణం

కలెక్టరేట్‌ వద్ద వామపక్ష ధర్నా

కడప(రవీంద్రనగర్‌), ఆగస్టు 9: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని సోమవారం కడప కలెక్టరేట్‌ వద్ద కార్మిక సంఘాలు, వామపక్షాల ఆఽధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.చంద్ర, సీపీఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నారాయణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయ రంగంలో ఇప్పటివరకు ఉన్న మద్దతుదారుల విధానం, ప్రభుత్వ పంటల కొనుగోలు సంస్థలు, మార్కెటింగ్‌ కమిటీలు బలహీనపడి కనుమరుగవుతున్నాయన్నారు. లాభాలు గడిస్తున్న రైల్వేలను, ఎల్‌ఐసీ, బీఎ్‌సఎనఎల్‌, పోస్టల్‌, విశాఖ ఉక్కు రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడమే కాకుండా అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. విద్యుతరంగాన్ని ప్రైవేటీకరించే లక్ష్యంతో రాషా్ట్రలపై వత్తిడి తెస్తూ రాషా్ట్రల హక్కులు హరిస్తోందన్నారు. కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాఽధించుకున్న హక్కులు కాలరాస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌చట్టాలు తీసుకువచ్చిందన్నారు. పనిగంటలు 8 నుంచి 12 గంటలకు పెంచేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కేసీ బాదుల్లా, జిల్లా కార్యదర్శులు మద్దిలేటి, లింగన్న, రైతు సంఘం నాయకులు జయన్న, సావంత సుధాకర్‌, కొండయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకులు బసీరున్నీసా, ఏఐఎ్‌సఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి వలరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-10T09:53:30+05:30 IST