చిట్వేలిలో ఎన్‌సీసీ శిక్షణ తరగతులు
ABN , First Publish Date - 2021-02-07T04:54:20+05:30 IST
చిట్వేలి ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ కేడెట్లకు మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ పేర్కొన్నారు.

చిట్వేలి, ఫిబ్రవరి6 : చిట్వేలి ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ కేడెట్లకు మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతులు ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 5, 6, 7వ తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఎన్‌సీసీ అధికారి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజు ఎన్‌సీసీ 30ఆంధ్రా బెటాలియన్ అధికారులు నాయక్ సుభేదార్ జగ్విర్‌సింగ్, హవల్దార్ మాన్‌సింగ్, ఎన్‌సీసీ డ్రిల్, మ్యాప్ రీడింగ్, కంపాస్ తదితర వాటిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. రెండో రోజు శనివారం తుపాకీ వాడే విధానం, టెక్నికల్, హెల్త్ అండ్ హైజి్‌సపై శిక్షణ ఇచ్చామన్నారు. ఈ నెల 10వతేదీన నిర్వహించనున్న ఏ సర్టిఫికెట్ పరీక్ష కోసం శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. ఈ శిక్షణ తరగతులు ఆదివారంతో ముగుస్తాయన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఎన్‌సీసీ సీనియర్, జూనియర్ కేడెట్లు పాల్గొన్నారు.