నవరాత్రోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-08T04:30:15+05:30 IST

రాష్ట్ర వ్యా ప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగం గా అమ్మవార్ల ఆలయాల్లో అమ్మవార్లను వివిధ రకాల అలంకారాల్లో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

నవరాత్రోత్సవాలు ప్రారంభం
పోరుమామిళ్లలో రాజరాజేశ్వరి దేవి అలంకారం

పోరుమామిళ్ల, అక్టోబరు 7: రాష్ట్ర వ్యా ప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగం గా అమ్మవార్ల ఆలయాల్లో అమ్మవార్లను  వివిధ రకాల అలంకారాల్లో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. పోరుమామిళ్ల వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. గురువారం రాత్రి అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులు దర్శిం చుకున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పూజలు చేశారు. 

బద్వేలు రూరల్‌, అక్టోబరు 7: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిశాలలో మొదటి రోజు జగజ్జనని అలంకారంలో కన్యకాపరమేశ్వరీ దేవి భక్తుల కు దర్శనమిచ్చారు. మహాలక్ష్మీ ఆలయం, శ్రీరామాలయం, వీరభద్రస్వామి ఆలయంలో ఉత్సవాలను ఆయా ఆలయాల కమిటీలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. 

కాశినాయన అక్టోబరు7: నర్సాపురం రాయాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించారు. మొదటి రోజు సీతాదేవి త్రిపుర సుందరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మైదుకూరు, అక్టోబరు 7: పట్టణంలో దశరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిశాల, పాతూరులోని పెద్దమ్మ తల్లి, కోదండరామాలయం, జీవీ సత్రం  అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు చేశారు. 

ఖాజీపేట, అక్టోబరు 7: దసరా ఉత ్సవాలు ప్రారంభమయ్యాయి.  కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం విద్యుత్తు కాంతులతో వెదజల్లుతోంది. అమ్మవారు దీక్షా బంధన అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలో అమ్మవారికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య ప్రతినిధులు కొనితాల మోహన్‌, గరిశా గంగిశెట్టి, మాకం రామకృష్ణయ్య, టీడీపీ నేతలు పాల్గొన్నారు. 

పులివెందుల రూరల్‌, అక్టోబరు 7:   శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యా యి. అంకాలమ్మ దేవస్థానంలో మొదటి రోజు అంకాలమ్మ అమ్మవారిని దీక్షాబం ధన దేవీ అలంకరణ చేశారు. శ్రీపద్మావ తి కల్యాణ వేంకటరమణస్వామి ఆల యం విద్యుత్‌ దీపాలం కరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 

వేంపల్లె, అక్టోబరు 7: వేంపల్లె అమ్మ వారిశాలలో శరన్నవరాత్రోత్సవాలు పుర స్కరించుకుని వాసవీమాత రాజరాజేశ్వ రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరాజరా జేశ్వరీ దేవి అలంకరణ  తీర్చిదిద్దారు. శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మ వారిని భక్తులు దర్శించి పూజలు చేసి తీర్థప్రసాదాలు అందుకున్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిశాల ఆలయాన్ని ఆర్యవైశ్య సంఘం ప్రత్యేకంగా ముస్తాబుచేసింది.

దువ్వూరు, అక్టోబరు 7: వాసవీ కన్యకాపర పరమేశ్వరీదేవి ఆలయంలో దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కలశస్థాపన నిర్వహించారు.







Updated Date - 2021-10-08T04:30:15+05:30 IST