ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి
ABN , First Publish Date - 2021-07-24T05:34:40+05:30 IST
రైతులు తాము సాగు చేసే పంటల్లో కొంత భాగాన్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించాలని ట్రైనీ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. మండల పరిధిలోని చెన్నంరాజుపల్లె గ్రామంలో శనివారం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గంగిరెడ్డి పొలాన్ని పరిశీలించారు.

పెండ్లిమర్రి, జూలై 23: రైతులు తాము సాగు చేసే పంటల్లో కొంత భాగాన్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించాలని ట్రైనీ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. మండల పరిధిలోని చెన్నంరాజుపల్లె గ్రామంలో శనివారం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గంగిరెడ్డి పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు హాజరై రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో మాట్లాడుతూ టైసోయిన్ కషాయాల గురించి, విత్తన బ్యాంకు నుంచి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజరు నాగరాజు, మాస్టర్ ట్రైనర్లు, మండల వ్యవసాయాధికారి ఓబులేసు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.