ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
ABN , First Publish Date - 2021-05-06T04:48:58+05:30 IST
ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తక్కువ, దిగుబడులు ఎక్కువ అని, ఆరోగ్యకరమైన పంటలు పండిం చవచ్చనని వ్యవసాయ కేంద్రం రాష్ట్ర రీజనల్ కోఆర్డినేర్ ఆదినారా యణ అన్నారు.

పులివెందుల రూరల్, మే 5: ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తక్కువ, దిగుబడులు ఎక్కువ అని, ఆరోగ్యకరమైన పంటలు పండిం చవచ్చనని వ్యవసాయ కేంద్రం రాష్ట్ర రీజనల్ కోఆర్డినేర్ ఆదినారా యణ అన్నారు. ఉలిమెల్ల వాసి ప్రకృతి వ్యవసాయ ఛాంపియన రైతు సుదర్శనరెడ్డి సాగుచేస్తున్న పొలాన్ని రీజనల్ కోఆర్డినేటర్ పరిశీలించారు.
రైతు పండించిన కొలంబో ఆముదం, కంది, బొప్పా యి, మునగ, నువ్వులు, పెసలు, మినుములను పరిశీలించారు. సుస్థి ర వ్యవసాయ కేంద్రం ద్వారా ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామ ని, తాము సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటామని రీజనల్ కోఆర్డినేర్ ఆదినారాయణ రైతుకు హామీ ఇచ్చారు.