రేపు జాతీయ మెగా లోక్‌అదాలత్‌

ABN , First Publish Date - 2021-12-10T04:20:47+05:30 IST

జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 11న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్‌ తెలిపారు.

రేపు జాతీయ మెగా లోక్‌అదాలత్‌

2596 కేసుల పరిష్కారమే లక్ష్యం : జిల్లా ప్రధాన జడ్జి 

కడప (రూరల్‌), డిసెంబరు 9: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 11న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్‌ తెలిపారు. సంబంధిత వివరాలను ఆయన గురువారం వెల్లడించారు. జాతీయ మెగా లోక్‌అదాలత్‌ సందర్భంగా 2596 కేసులు పరిష్కార లక్ష్యంగా నిర్ణయించామ న్నారు. ఇందులో 2315 రాజీపడదగిన కేసులు అలాగే 276 ప్రీలిటిగేషన్‌ కేసులను ఐడెంటిఫై చేయడం జరిగిందన్నారు. వీటి పరిష్కారానికి జిల్లా అంతటా అన్ని కోర్టులలో 23 చెంచ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమగ్ర సమాచారం, కేసుల వివరాల కోసం కక్షిదారులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్‌, బ్యాంకు, ఏపీఎ్‌సఆర్‌టీసీ అధికారులు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు. ఇరుపార్టీల సమ్మతి మేరకు ఎలాంటి ఖర్చు లేకుండా రాజీమార్గంలో కేసు పరిష్కరించబడుతుందన్నారు. దీనివలన మానవ సంబంఽధాలు చెడవన్నారు. లోక్‌ అదాలత్‌లో కేసు పరిష్కారమైతే సుప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు. తిరిగి అప్పీలుకు వెళ్లడానికి వీలుండదన్నారు. ఇంతటి ప్రయోజనం ఉన్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కారం అయ్యేలా చొరవచూపి విజయవంతం చేయాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. 

Updated Date - 2021-12-10T04:20:47+05:30 IST