11న జాతీయ లోక్ అదాలత్
ABN , First Publish Date - 2021-08-26T04:50:03+05:30 IST
జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరు 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన జడ్జి సి.పురుషోత్తంకుమార్, సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కవిత సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా ప్రధాన జడ్జి పురుషోత్తంకుమార్
కడప (రూరల్), ఆగస్టు 25: జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరు 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన జడ్జి సి.పురుషోత్తంకుమార్, సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కవిత సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్ వ్యాజ్యాలు, క్రిమినల్, కాంపౌండబుల్ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, అమలు పిటీషన్లు తదితర కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఎవరైనా తమ కేసులను రాజీ చేసుకోదలుచుకుంటే ఏ కోర్టులో అయితే వారి కేసు నడుస్తుందో ఆ కోర్టులో అప్లికేషన్ ఇస్తే వారి సమ్మతితో లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.