జనసేన రాష్ట్ర కార్యదర్శిగా నాగేంద్ర

ABN , First Publish Date - 2021-07-09T05:05:22+05:30 IST

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రైల్వేకోడూరుకు చెందిన తాతంశెట్టి నాగేంద్రను నియమిస్తూ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

జనసేన రాష్ట్ర కార్యదర్శిగా నాగేంద్ర
నియామక పత్రాన్ని అందుకుంటున్న నాగేంద్ర

రైల్వేకోడూరు, జూలై 8: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రైల్వేకోడూరుకు చెందిన తాతంశెట్టి నాగేంద్రను నియమిస్తూ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నియామక పత్రాన్ని నాగేంద్ర గురువారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి అంకితభావంతో పని చేస్తామని, రైల్వేకోడూరులో జనసేన బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతామన్నారు.   

Updated Date - 2021-07-09T05:05:22+05:30 IST