స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నాగముని
ABN , First Publish Date - 2021-10-29T05:08:18+05:30 IST
జేఎన్‌టీయూ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు బి.నాగముని ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.ఎం.వి.నారాయణ ప్రకటనలో తెలిపారు.

రాజంపేట, అక్టోబరు 28 : జేఎన్‌టీయూ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు బి.నాగముని ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.ఎం.వి.నారాయణ ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి అనంతపురం జేఎన్‌టీయూ యూనివర్సిటీ నాగమునిని స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమించిందన్నారు. ఆయన అనేక సార్లు జేఎన్‌టీయూ స్పోర్ట్స్ సెలక్షన్ మెంబర్‌గా వ్యవహరించి విశిష్ట నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారన్నారు.