డబ్బుల విషయమై పరస్పర దాడులు

ABN , First Publish Date - 2021-11-10T05:19:01+05:30 IST

మండల పరిధిలోని ఒంటిమిట్ట డ్వాక్రా సీసీగా పనిచేస్తున్న శాంత కుమారి, ఒంటిమిట్ట సచివాలయంలో వలంటీరుగా పనిచేస్తున్న లీలావతి సోమవారం సాయంత్రం స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు ఆవరణలో పర్సపరం దాడు లు చేసుకున్నారు.

డబ్బుల విషయమై పరస్పర దాడులు

ఒంటిమిట్ట, నవంబరు 9 : మండల పరిధిలోని ఒంటిమిట్ట డ్వాక్రా సీసీగా పనిచేస్తున్న శాంత కుమారి, ఒంటిమిట్ట సచివాలయంలో వలంటీరుగా పనిచేస్తున్న లీలావతి సోమవారం సాయంత్రం స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు ఆవరణలో పర్సపరం దాడు లు చేసుకున్నారు. డ్వాక్రా డబ్బుల విషయమై ఇరువురి మధ్య గత కొంత కాలంగా వివాదం ఉంది.  సోమవారం స్థానిక ఎస్‌బీఐ మేనేజర్‌ ఎదుట ఇరువురు వాగ్వాదా నికి దిగి గొడవపడ్డారు. బ్యాంకులోనే ఇరువురు కుటుంబ సభ్యులతో కలిసి పాదరక్షలతో దాడి చేసుకున్నారు. ఈవిషయం తెలుసుకున్న స్థానిక ఏఎ్‌సఐ గౌరీనాధ్‌ ఘటనాస్థలానికి చేరుకొని ఇరువురిని పోలీ్‌సస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఎస్‌ఐ సంజీవరాయుడుని వివరణ కోరగా పరస్పరం ఫిర్యాదు చేశారని విచారిస్తున్నామని తెలిపారు. 

 

Updated Date - 2021-11-10T05:19:01+05:30 IST