చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-30T04:53:52+05:30 IST

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జమ్మలమడుగు బార్‌ అసోసియేషన్‌ కమిటీ న్యాయవాదులు జాకీర్‌, జయన్నలు సూచించారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 29: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జమ్మలమడుగు బార్‌ అసోసియేషన్‌ కమిటీ న్యాయవాదులు జాకీర్‌, జయన్నలు సూచించారు. శుక్రవారం  మండలంలోని గూడెం చెరువు గ్రామంలో జడ్జి బాబాఫకృద్దీన్‌ ఆదేశాల మేరకు న్యాయసదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు  భవన నిర్మాణాలు , నిరక్షరాస్యత, మహిళా సమస్యలపై వివరించారు. ఈ కార్యక్రమాలు నవంబరు 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 

Updated Date - 2021-10-30T04:53:52+05:30 IST