బ్యాంకు ఖాతాల్లో దేశంలోనే అగ్రస్థానలో ఉండాలి

ABN , First Publish Date - 2021-07-13T05:05:23+05:30 IST

ప్రతి ఒక్కరికీ ఆర్థిక ఫలాలు అందాలి.. ప్రజల్లో ఆర్థిక క్రమ శిక్షణ కల్పించాలనే ఆశయం గా కేంద్ర ప్రభుత్వం గుర్తిం చిన ఆకాంక్షాత్మక (ఆస్పిరేష నల్‌) జిల్లాల లక్ష్యం అధిగ మించి.. బ్యాంకు ఖాతాలు తెరవడంతో కడప జల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలు పుదామని కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు బ్రిజ్‌ మోహన్‌శర్మ పేర్కొన్నారు.

బ్యాంకు ఖాతాల్లో దేశంలోనే అగ్రస్థానలో ఉండాలి
మాట్లాడుతున్న కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షాత్మక జిల్లాల లక్ష్యాన్ని అధిగమిద్దాం

కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు మోహన్‌శర్మ


కడప(సిటి), జూలై 12:  ప్రతి ఒక్కరికీ ఆర్థిక ఫలాలు అందాలి.. ప్రజల్లో ఆర్థిక క్రమ శిక్షణ కల్పించాలనే ఆశయం గా కేంద్ర ప్రభుత్వం గుర్తిం చిన ఆకాంక్షాత్మక (ఆస్పిరేష నల్‌) జిల్లాల లక్ష్యం అధిగ మించి.. బ్యాంకు ఖాతాలు తెరవడంతో కడప జల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలు పుదామని కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు బ్రిజ్‌ మోహన్‌శర్మ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఏపీజీబీ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన బ్యాంకుల రీజినల్‌ మేనేజర్లతో ఆకాంక్షాత్మక జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌శర్మ మాట్లాడుతూ లక్ష మంది జనాభాకు 1,29,755 బ్యాంకు సేవింగ్‌ ఖాతాలు (కొందరికి రెండు మూడు బ్యాంకుల్లో ఖాతాలు కలిపి) ఉంటే ఆ జిల్లాను ఆర్థిక లావాదేవిల్లో మంచి జిల్లాగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అంతకంటే తక్కువ ఖాతాలు ఉన్న 112 జిల్లాలను ఆకాంక్షాత్మక జిల్లాలుగా గుర్తించింది. అందులో కడప జిల్లా కూడా ఒకటి అని వివరించారు. జిల్లాలో లక్ష జనాభాకు 1,28,099 ఖాతాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇంకా 1,656 ఖాతాలు ఓపెన్‌ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ లెక్కన 2011 జనాభా గణాంకాల ప్రకారం 46,368 బ్యాంక్‌ అకౌంట్స్‌ ఓపన్‌ చేయించాల్సి ఉందన్నారు. 2011 తరువాత ఈ పదేళ్లలో పెరిగిన జనాభా ప్రకారం 32 లక్షలకు చేరిందని, ఆ ప్రకారం 52,992 ఖాతాలు ఓపన్‌ చేసి కడపను దేశంలోనే అగ్ర స్థానం లో నిలిపేందుకు లీడ్‌ బ్యాంక్‌ పరిధిలోని అన్ని రకాల బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది సమన్వయం, సమష్టి కృషితో లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టరు హరికిరణ్‌ను కలిసి ఏపీజీబీ తరపున పది ఆక్సిజన్‌కాన్సంట్రేటర్లను వితరణగా అందించారు. కలెక్టరు స్పందిస్తూ కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అందించడం అభినందనీయమన్నారు. సమావేశంలో ఎల్‌బీఎస్‌ హెచ్‌ఓ జనరల్‌ మేనేజరు చంద్రశేఖర్‌, ఏపీజీబీ చైర్మన్‌ రాకేష్‌కశ్యప్‌, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజరు, అన్ని శాఖల బ్యాంకుల రీజినల్‌ మేనేజర్లు, నాబార్డు డీడీఎం తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-07-13T05:05:23+05:30 IST