పింఛన్లు అందజేసిన మున్సిపల్‌ కమిషనర్‌

ABN , First Publish Date - 2021-02-02T04:59:02+05:30 IST

పట్టణంలోని పలు వార్డుల్లోని లబ్ధిదారులకు, వృద్ధులకు మున్సిపల్‌ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పింఛన్లు అందజేశారు.

పింఛన్లు అందజేసిన మున్సిపల్‌ కమిషనర్‌

రాజంపేట, ఫిబ్రవరి1 : పట్టణంలోని పలు వార్డుల్లోని లబ్ధిదారులకు, వృద్ధులకు మున్సిపల్‌ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో వార్డు వలంటీర్లు ఎలాంటి అలసత్వం వహించకూడదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. అదే విధంగా పట్టణంలోని రామ్‌నగర్‌కు సంబంధించి నీటి సమస్యపై పైపులైను మరమ్మతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటప్ప, డీపీవో గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T04:59:02+05:30 IST