రైతన్నను ముంచిన తుఫాను

ABN , First Publish Date - 2021-11-03T05:16:43+05:30 IST

అతివృష్టి, అనావృష్టి రైతులకు శాపంగా మారింది. ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతన్నను వెంటాడుతున్నా పం ట సాగు చేస్తున్నా ఫలితం శూన్యమవుతోం ది. ఈ ఏడాది తుఫాను రూపంలో పంట నీటిపాలైంది. వివరాల్లోకెళితే...

రైతన్నను ముంచిన తుఫాను
పొలంలోనే కుల్లిపోయిన పత్తి మొక్క

- వందల ఎకరాల్లో పత్తి, వరి నీటిపాలు 

- నష్టాల ఊబిలో రైతన్న 

- పరిశీలిచిన అధికారులు

ఖాజీపేట, నవంబరు 2: అతివృష్టి, అనావృష్టి రైతులకు శాపంగా మారింది.  ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతన్నను వెంటాడుతున్నా పం ట సాగు చేస్తున్నా ఫలితం శూన్యమవుతోం ది. ఈ ఏడాది తుఫాను రూపంలో పంట నీటిపాలైంది. వివరాల్లోకెళితే...   

 వారం రోజుల నుంచి తుఫాను ప్రభావంతో ఎడతెరపి లేకుండా మండలంలో వర్షం కురుస్తోంది. ఈ వర్షం సాగు చేసిన వరి, పత్తిపంటలపై తీవ్ర ప్రభావం చూపింది. వందల ఎకరాల్లో ఈ పంటల్లో నీరు నిల్వ ఉండడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. చెట్టుకే పత్తి మొలకలు రావడంతోపాటు మరికొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోయింది.  గతేడాది పత్తికి బీమా కూడా రాకపోవడంతో రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వం స్పందించి బీమాతో ఇచ్చి ఆదుకోకపోతే రైతన్న గడ్డు పరిస్థితి నుంచి కోలుకోలేడు.

పరిశీలించిన అధికారులు

 చెముళ్లపల్లె, తుడమలదిన్నె గ్రామాల్లో దెబ్బతిన్న వరి, పత్తి పంటలను ఏరువాక శాస్త్రవేత్త వీరయ్య, ఏడీఏ నరసింహారెడ్డి, ఏఓ శివశైలజ పరిశీలించారు. రైతులకు పలు సూచనలు అందించారు. ప్రభుత్వానికి దెబ్బతిన్న పంటల వివరాలు తెలిపామన్నారు. 

రైతాంగాన్ని ఆదుకుంటాం

తుఫాను ప్రభావంతో వరి, పత్తి పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి పేర్కొన్నారు. కె.సుంకేసుల, తవ్వారిపల్లె, కొమ్మలూరు గ్రామాల్లో దెబ్బతిన్న పత్తి, వరి పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. 




Updated Date - 2021-11-03T05:16:43+05:30 IST