మైనింగ్‌ గుట్ట పరిశీలన

ABN , First Publish Date - 2021-10-26T05:03:09+05:30 IST

మండలంలోని మట్లి పంచాయతీలోని రెడ్డివారిపల్లె సమీపంలో ఉన్న మైనింగ్‌ గుట్టను సోమవారం తహసీల్దార్‌ ఉదయభారతి పరిశీలించారు.

మైనింగ్‌ గుట్ట పరిశీలన

వీరబల్లి, అక్టోబరు25: మండలంలోని మట్లి పంచాయతీలోని రెడ్డివారిపల్లె సమీపంలో ఉన్న మైనింగ్‌ గుట్టను సోమవారం తహసీల్దార్‌ ఉదయభారతి పరిశీలించారు. గతంలో ఉన్న కాంట్రాక్టరు లీజు సమయం అయిపోవడంతో తిరిగి అనుమతి కోసం గుట్టను పరిశీలించారు. అనుమతి లేకుండా గుట్టలోకి ప్రవేశించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్‌ శివప్రసాద్‌రెడ్డి, వీఆర్‌వో సంజీవ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:03:09+05:30 IST