ఎస్‌ఎ్‌సఏ వెబ్‌సైట్‌లో కేజీబీవీ పోస్టుల మెరిట్‌ జాబితా

ABN , First Publish Date - 2021-12-27T05:13:58+05:30 IST

కేజీబీవీలకు సంబంధించిన ప్రిన్సిపాల్‌ పోస్టుల మెరిట్‌ జాబితా ఎస్‌ఎస్‌ఏ వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు సమగ్ర శిక్ష అభియాన్‌ జిల్లా పథక సంచాలకులు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

ఎస్‌ఎ్‌సఏ వెబ్‌సైట్‌లో కేజీబీవీ పోస్టుల మెరిట్‌ జాబితా

కడప(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 26: కేజీబీవీలకు సంబంధించిన ప్రిన్సిపాల్‌ పోస్టుల మెరిట్‌ జాబితా ఎస్‌ఎస్‌ఏ వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు సమగ్ర శిక్ష అభియాన్‌ జిల్లా పథక సంచాలకులు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కస్తూర్బా గాంధీ పాఠశాల (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్‌, పీజీటీ పోస్టులకు సంబంధించి ప్రాథమిక పరిశీలన ముగిసిందన్నారు. అభ్యర్థుల వివరాలతో కూడిన ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను ‘హెచ్‌టీటీపీ//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎ్‌సఎ్‌సఏకడప.కామ్‌’లేదా ‘కడపడీఈఓ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో పొస్టుల వారీగా ఉంచినట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ జాబితాను పరిశీలించి సరిచూసుకోవాలని పేర్కొన్నారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు తమ అభ్యర్థనలను ఈ నెల 27వ తేదీ నుంచి 29 సాయంత్రం 5 గంటలలోపు అదనపు పథక సమన్వయకర్త, సమగ్రశిక్ష, కడప కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. అలాగే మెరిట్‌ జాబితాలోని రిమార్క్స్‌లో అభ్యర్థులకు సంబంధించి వివరాలను గమనించి, ఏయే సర్టిఫికెట్లు లేవని పే ర్కొన్నారో (మార్కుల జాబితాలు, స్టడీ, రెసిడెన్స్‌, పీహెచ్‌ ధ్రువీకరణ పత్రం) వాటిని కూడా 29వ తేదీ లోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. 29వ తేదీ సాయం త్రం 5 గంటల తర్వాత అభ్యంతరాలు కానీ, రిమార్కులకు సరైన వివరణ పత్రాలు కానీ తీసుకోబడవని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-27T05:13:58+05:30 IST