క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2021-11-24T05:06:02+05:30 IST

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా క్రీడా సాధికార సంస్థ కడప వారి ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిభగల క్రీడాకారులకు బూట్లు, సాక్స్‌లను ప్రభాకర్‌రెడ్డి, స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి, నగర కమిషనర్‌ యు.రంగస్వామి పంపిణీ చేశారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం

జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి ప్రభాకర్‌రెడ్డి

కడప(ఎడ్యుకేషన్‌), నవంబరు 23: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా క్రీడా సాధికార సంస్థ కడప వారి ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిభగల క్రీడాకారులకు బూట్లు, సాక్స్‌లను ప్రభాకర్‌రెడ్డి, స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి, నగర కమిషనర్‌ యు.రంగస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో చీఫ్‌ కోచ్‌ బాషామొహిద్దీన్‌, క్రీడాకారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T05:06:02+05:30 IST