దెబ్బతిన్న రోడ్ల వద్ద జనసేన నిరసన

ABN , First Publish Date - 2021-09-03T05:16:41+05:30 IST

రాజంపేట మండలం సున్నపురాళ్లపల్లెలో దెబ్బతిన్న రోడ్ల వద్ద గురువారం జనసేన పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

దెబ్బతిన్న రోడ్ల వద్ద జనసేన నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకులు

రాజంపేట టౌన్‌, సెప్టెంబరు2 : రాజంపేట మండలం సున్నపురాళ్లపల్లెలో దెబ్బతిన్న రోడ్ల వద్ద గురువారం జనసేన పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఇబ్బందులు పడుతున్న పల్లె ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంగారి శివప్రసాద్‌, కత్తి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T05:16:41+05:30 IST