రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
ABN , First Publish Date - 2021-12-16T04:44:06+05:30 IST
కడప-రాయచోటి జాతీయ రహదారిలో బుధవారం జరిగిన రో డ్డు ప్రమాదంలో సునీ త (30) అనే వివాహిత మృతి చెందినట్లు సీకే దిన్నె హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్ తె లిపారు.

సీకేదిన్నె, డిసెంబరు 15: కడప-రాయచోటి జాతీయ రహదారిలో బుధవారం జరిగిన రో డ్డు ప్రమాదంలో సునీ త (30) అనే వివాహిత మృతి చెందినట్లు సీకే దిన్నె హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్ తె లిపారు. ఆయన అం దించిన వివరాల మేరకు... నందలూరుకు చెందిన భార్యాభర్తలైన సునీల్‌కుమార్, సునీత, అతడి తమ్ముడు శివతో కలిసి సునీత అమ్మగారి ఊరు అయిన వీరబల్లికి వెళ్లారు. అక్కడి నుంచి కడపలో ఉన్న వారి బంధువులను చూసేందుకు కడపకు వస్తుండగా జమాల్‌పల్లె వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో సునీత అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి మృతురాలి మరిది శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.