మార్కెట్‌ ప్రదేశం మార్పు : చైర్మన్‌

ABN , First Publish Date - 2021-05-06T04:50:45+05:30 IST

వైరస్‌ వ్యాప్తి పుంజుకుంటున్న తరుణంలో మార్కె ట్‌ ప్రదేశాన్ని మార్పు చేశామని మున్సిపల్‌ చైర్మన రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు.

మార్కెట్‌ ప్రదేశం మార్పు : చైర్మన్‌
సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన రాజగోపాల్‌రెడ్డి

బద్వేలు,  మే 5: వైరస్‌ వ్యాప్తి పుంజుకుంటున్న తరుణంలో మార్కె ట్‌ ప్రదేశాన్ని మార్పు చేశామని మున్సిపల్‌ చైర్మన రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక కూరగాయల మార్కెట్‌ అసోసియేషనతో పోలీసుస్టేషన ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలం తా అప్రమత్తంగా ఉండాలన్నారు.

కూరగాయల హోల్‌సెల్‌ మార్కెట్ల ను పోరుమామిళ్ల బైపాస్‌రోడ్డులోకి మార్చామన్నారు. జనం రద్దీని ఉండే అవకాశం ఉందని ఈ కారణాలదృష్ట్యా బైపాస్‌రోడ్డుకు మార్చి నట్లు ఆయన తెలిపారు. ప్రజలు కరోనా నిబందనలు పాటించాలని ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని ఆయన సూచించారు.

 కరోనా విజృంభణతో బద్వేలులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నా మని అర్బన్‌ సీఐ రమేష్‌బాబు తెలిపారు. ఉదయం నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకే పనులు ముగించుకోవాలని సూచించామ న్నారు. అనవసరంగా బయట తిరగరాదని ఆయన సూచించారు. 

Updated Date - 2021-05-06T04:50:45+05:30 IST