రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-03T04:52:52+05:30 IST

సిద్దవటం మండలం మొహిద్దీన్‌సాహెబ్‌పల్లెకు చెందిన ఆవుల రాజేష్‌(35) ఉద్యోగరీత్యా ప్రతి రోజూ ద్విచక్ర వాహనంలో కడప పట్టణంలోని డ్రైఫుడ్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ ఉండేవాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సిద్దవటం, మే 2: సిద్దవటం మండలం మొహిద్దీన్‌సాహెబ్‌పల్లెకు చెందిన ఆవుల రాజేష్‌(35) ఉద్యోగరీత్యా ప్రతి రోజూ ద్విచక్ర వాహనంలో కడప పట్టణంలోని డ్రైఫుడ్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ ఉండేవాడు. తన గ్రామం నుంచి   మోటారు సైకిల్‌లో కడపకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రిసుమారు 7గంటల సమయంలో చాముండేశ్వరిపేట సమీపంలో అతని కంటే ముందు వెళుతున్న   పసుపు ఉడకబెట్టే మిషన్‌ను తీసుకొని వెళుతున్న ట్రాక్టర్‌ ఒక్కసారిగా కుడిపక్క తిరిగింది. దీంతో ద్విచక్ర వాహనంలో వెళుతున్న రాజేష్‌ ట్రాక్టరు మధ్యభాగంలో డడ కొన్నాడు. దీంతో అతని తలకు గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం 108 లో   కడప రిమ్స్‌కు తరలించినట్లు సిద్దవటం పోలీసులు తెలిపారు. కాగా  రిమ్స్‌ వైద్యులు పరిశీలించి ఆ వ్యక్తి చనిపోయాడని తెలినట్లు సిద్దవటం పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంపై మృతుడు ఆవుల రాజేష్‌ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-05-03T04:52:52+05:30 IST