గణతంత్ర వేడుకలను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-01-21T05:16:15+05:30 IST

గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను లోటుపాట్లు లేకుండా చేపట్టాలని జేసీ (రెవెన్యూ) గౌతమి అధికారులను ఆదేశించారు.

గణతంత్ర వేడుకలను విజయవంతం చేయండి
మాట్లాడుతున్న జేసీ గౌతమి

జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి 

కడప(కలెక్టరేట్‌), జనవరి 20: గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను లోటుపాట్లు లేకుండా చేపట్టాలని జేసీ (రెవెన్యూ) గౌతమి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో వేడుకల ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ నెల 26న స్థానిక పోలీస్‌ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకల్లో జెండా వందనానికి అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలన్నారు. అలాగే వేదిక అందంగా అలంకరించేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను, కార్యక్రమానికి హాజరైన వారందరికీ తాగునీరు ఏర్పాట్లు చేపట్టాలని నగర మున్సిపల్‌ కమిషనర్‌ లవన్నను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబ సభ్యులను, ఇతర అతిథులను ప్రత్యేకంగా ఆహ్వా నించాలన్నారు. కార్యక్రమంలో జేసీ అభివృద్ధి సాయికాంత్‌వర్మ, జేసీ (సంక్షేమం) ధర్మచంద్రారెడ్డి, డీఆర్వో మలోల, డీఎఫ్‌ఓ రవీంద్రధామ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చినరాముడు, మున్సిపల్‌ కమిషనరు లవన్న, సీపీఓ తిప్పే స్వామి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T05:16:15+05:30 IST