భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-03-23T04:28:20+05:30 IST

మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీ జరిగే భారత్‌బంద్‌లో అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.

భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి
మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య

కడప(రవీంద్రనగర్‌), మార్చి 22: మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీ జరిగే భారత్‌బంద్‌లో అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలు రైతాంగానికి, ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, వాటిని రద్దు చేయాలని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T04:28:20+05:30 IST