చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-10-20T04:47:08+05:30 IST

జాతీయ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర ్యంలో మందకృష్ణమాదిగ, మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టబోయే చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్‌ నాయకులు గడ్డం నరసింహులు మాదిగ, ఇల్లూరు శివశంకర్‌ మాదిగ పేర్కొన్నారు.

చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి

ప్రొద్దుటూరు రూరల్‌, అక్టోబరు 19: జాతీయ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర ్యంలో మందకృష్ణమాదిగ, మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టబోయే చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్‌ నాయకులు గడ్డం నరసింహులు మాదిగ, ఇల్లూరు శివశంకర్‌ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం వారు అనిబిసెంట్‌ మున్సిపల్‌ పాఠశాల మైదానంలో చలో హైదరాబాద్‌ పోస్టర్ల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మాదిగ బిడ్డ ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. ఐక్య పోరాటాలతోనే విజయం సాధ్యమని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-20T04:47:08+05:30 IST