మధ్యాహ్న భోజనం మెనూ పాటించాలి : డీఈవో

ABN , First Publish Date - 2021-10-29T05:09:57+05:30 IST

మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు.

మధ్యాహ్న భోజనం మెనూ పాటించాలి : డీఈవో

సీకేదిన్నె, అక్టోబరు 28: మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం బాలుపల్లెలో గురువారం ఆమె మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భోజనం మెనూ ప్రకారం సుచిగా, రుచిగా ఉండే విధంగా చూడాలన్నారు. అనంతరం సీకెదిన్నె జడ్పీ హైస్కూ లు విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులకు తగు సలహాలు ఇచ్చారు. అనంతరం హోంగార్డు కాలనీలో ఉన్న కోడిగుడ్ల గోడౌన్‌ను తనిఖీ చేశారు. గుడ్ల సైజును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటరామిరెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-29T05:09:57+05:30 IST