రక్షణ గోడను ఢీకొన్న లారీ : డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-21T04:49:25+05:30 IST

రామాపురం-లక్కిరెడ్డిపల్లె ప్రధాన రహదారిలోని రామాపురం మండలం సుద్దమళ్ల పంచాయతీ రేకులకుంట సమీపంలో గురువారం లారీ రక్ష ణ గోడను ఢీకొని డ్రైవర్‌ బి.రవి (31) అక్కడికక్కడే మృతి చెందా డు.

రక్షణ గోడను ఢీకొన్న లారీ : డ్రైవర్‌ మృతి
మృతి చెందిన లారీ డ్రైవర్‌ రవి

రామాపురం, మే 20: రామాపురం-లక్కిరెడ్డిపల్లె ప్రధాన రహదారిలోని రామాపురం మండలం సుద్దమళ్ల పంచాయతీ రేకులకుంట సమీపంలో గురువారం లారీ రక్ష ణ గోడను ఢీకొని డ్రైవర్‌ బి.రవి (31) అక్కడికక్కడే మృతి చెందా డు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. పెండ్లిమర్రి మండలం బుచ్చిరెడ్డిగారిపల్లెకి చెం దిన రవి ఏపీ04 టీఎస్‌ 3345 నెంబరు గల లారీలో గురువారం లక్కిరెడ్డిపల్లె నుంచి కడపకు వస్తుండగా రేకులకుంట సమీపానికి రాగానే అదుపు రక్షణ గోడను ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జయరాములు, సిబ్బంది మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతుడి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-05-21T04:49:25+05:30 IST