గంగమ్మ తల్లికి ఏకాంత పూజలు

ABN , First Publish Date - 2021-05-21T04:50:59+05:30 IST

పట్టణంలోని బలిజవీధిలో వెలసిన గంగమ్మ తల్లికి గురువారం భక్తిశ్రద్ధలతో సాటు ము ద్దల జాతర నిర్వహించారు.

గంగమ్మ తల్లికి ఏకాంత పూజలు
పోలీసుల ఆధ్వర్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గంగమ్మ తల్లికి ఏకాంత పూజలు చేస్తున్న భక్తులు

రైల్వేకోడూరు, మే 20: పట్టణంలోని బలిజవీధిలో వెలసిన గంగమ్మ తల్లికి గురువారం భక్తిశ్రద్ధలతో సాటు ము ద్దల జాతర నిర్వహించారు. కరోనా కారణంగా జాతర ని లిపేసిన విషయం విదితమే. బలిజవీధిలోని ప్రతి ఇం టిలో సాటు ముద్దలు పెట్టుకుని అమ్మవారికి పూజలు చేశారు. ఇంటి వద్దనే కోళ్లు, పొట్టేళ్లు, మేకపోతులు సమర్పించుకున్నారు. గంగమ్మ ఆలయం చుట్టూ వేపమండలు చుట్టించారు. విద్యుత్‌ దీపాలంకరణ చేశారు. భక్తు లు గుంపులు గుంపులుగా వెళ్లకుండా రైల్వేకోడూరు సీఐ ఆవుల ఆనందరావు, ఎస్‌ఐ-1 పెద్ద ఓబన్నలు సిబ్బందితో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్లకుండా ఐదుచోట్ల రోడ్డుకు అడ్డంగా కట్టెలు కట్టేశారు.  

Updated Date - 2021-05-21T04:50:59+05:30 IST