ఏకాంతంగా వాసవీమాత జయంతి

ABN , First Publish Date - 2021-05-22T04:50:18+05:30 IST

వాసవీ కన్యాకా పరమేశ్వరీ దేవి జయంతి సందర్భంగా అమ్మవారిశాలలో వాసవీమాత మూల విరాట్టుకు అర్భకులు ఏకాంత పూజలు నిర్వహించారు.

ఏకాంతంగా వాసవీమాత జయంతి
మైదుకూరులో ప్రత్యేక అలంకార పూజలో వాసవీమాత

మైదుకూరు, మే 21: వాసవీ కన్యాకా పరమేశ్వరీ దేవి జయంతి సందర్భంగా అమ్మవారిశాలలో వాసవీమాత మూల విరాట్టుకు అర్భకులు ఏకాంత పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు సత్య నారాయణ శర్మ ఆధ్వర్యంలో పంచామృ తాభిషేకం, అభిషేకం కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు వారి ఇళ్లల్లోనే అమ్మవారి చిత్రపటం ఉంచి కుంకుమా ర్చనలు చేపట్టి ప్రసాదాలు అందించారు. 

వేంపల్లెలో....

వేంపల్లె, మే 21: వాసవీ మాత జయంతిని పురస్కరించుకుని వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థానంలో అమ్మవారికి ఏకాంతంగా పూజలు నిర్వహించారు. శుక్రవారం కన్యకాపమేశ్వరీ ఆలయంలో ఆర్యవైశ్య సం ఘం ఆధ్వర్యంలో ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించి రోజాపూల తోమాలలతో ప్రత్యేక అలంకరణ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పెద్ద పుల్లయ్య, హరికృష్ణ, యువజన సంఘం జాయింట్‌ సెక్రటరీ సతీష్‌, నిరంజన, సురేష్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

దువ్వూరు, మే 21: మండల కేంద్రమైన దువ్వూరులోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో వాసవీ జయంతిని పురష్కరించుకు ని ఘనంగా పూజలు నిర్వహించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. 


Updated Date - 2021-05-22T04:50:18+05:30 IST