మద్యం షాపులను మూసివేయాలి

ABN , First Publish Date - 2021-05-03T04:38:22+05:30 IST

కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని బ్రాంది షాపులను, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి జిల్లా కన్వీనర్‌ వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

మద్యం షాపులను మూసివేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరమణ

బద్వేలు రూరల్‌, మే 2: కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని బ్రాంది షాపులను, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి జిల్లా కన్వీనర్‌ వెంకటరమణ డిమాండ్‌ చేశారు. స్థానిక జిల్లా పరిషత బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ

  లిక్కరు కొనుగోలు కోసం క్యూ కడుతున్నారన్నారు. ఒకరి మీద ఒకరు పడడం వలన వైరస్‌ వ్యాప్తి అధికం కాదా అని ప్రశ్నించారు. ఇరు కుగా ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నా రు. ప్రజలు పాణ్రాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ వ్యాప్తం గా బ్రాందిషాపులు, రెస్టారెంట్లను మూసివేంచాలని ప్రజాప్రతినిధు లను ఆయన కోరారు.

కార్యక్రమంలో అంబేడ్కర్‌ ఆశయ సాధన కమిటీ తాలుకా కన్వీనర్‌ పిచ్చయ్య, బీఎస్పీ నేత కేశవయ్య, డీవీఎఫ్‌ జిల్లా కార్యవర్గసభ్యుడు చిన్నయ్య, ఎమ్మార్పీఎస్‌ నేతలు శిఖామణి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-03T04:38:22+05:30 IST