వైభవంగా లింగమయ్య స్వామి తిరుణాళ్ల

ABN , First Publish Date - 2021-02-05T05:42:28+05:30 IST

మండలంలోని చౌటిపల్లె గ్రామంలో లింగమయ్యస్వామి తిరుణాళ్ల గురువారం వైభవంగా జరిగింది.

వైభవంగా లింగమయ్య స్వామి తిరుణాళ్ల
ప్రత్యేక అలంకరణలో చౌటిపల్లె లింగమయ్య స్వామి

కొండాపురం,ఫిబ్రవరి4: మండలంలోని చౌటిపల్లె గ్రామంలో లింగమయ్యస్వామి తిరుణాళ్ల గురువారం వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది పుష్యమాసం చివరి గురువారం లింగమయ్యస్వామి తిరుణాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. గండికోట ప్రాజెక్టు కింద చౌటిపల్లె ముంపునకు గురికావడంతో ముద్దనూరు శెట్టివారిపల్లె ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లోను, కొండాపురం మండలం గండ్లూరు ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లోను చౌటిపల్లె పునరావాస గ్రామాన్ని ఏర్పరచుకొని రెండుచోట్ల లింగమయ్యస్వామిని ప్రతిష్ఠించి రెండుచోట్ల తిరుణాళ్లు నిర్వహించారు. లింగమయ్యస్వామి తిరుణాళ్లకు మన జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చారు.. తిరుణాళ్ల సందర్భంగా గ్రామదేవతలు పెద్దమ్మ, అంకాళమ్మతో పాటు లింగమయ్యస్వామికి మొక్కుబడిగా భక్తులు బోనాలు పెద్ద ఎత్తున సమర్పించారు. చెరుకుల అంగళ్లు, రంగుల రాట్నాలతో తిరుణాళ్ల కళకళలాడింది ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి లింగమయ్య స్వామి ని దర్శించుకొని స్థానిక వైసీపీ నాయకులు ఎర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.

Updated Date - 2021-02-05T05:42:28+05:30 IST