చెన్నూరు ఎంఈవోగా లిల్లెమ్మ

ABN , First Publish Date - 2021-02-02T04:48:19+05:30 IST

మండల విద్యాశాఖాధికారిగా లిల్లెమ్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

చెన్నూరు ఎంఈవోగా లిల్లెమ్మ
చెన్నూరు ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించిన లిల్లెమ్మ

చెన్నూరు, ఫిబ్రవరి 1: మండల విద్యాశాఖాధికారిగా లిల్లెమ్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వల్లూరు ఎంఈవోగా పనిచేస్తున్న ఈమె చెన్నూరు ఎంఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో విద్యా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రతి ఉపాధ్యాయుడు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు ఖచ్చితంగా హాజరు కావాలని సూచించారు. మండలాన్ని విద్యాపరంగా మంచి స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయమన్నారు. 

Updated Date - 2021-02-02T04:48:19+05:30 IST