పారిశుధ్య కార్మికుల మెరుపు సమ్మె

ABN , First Publish Date - 2021-05-03T04:55:58+05:30 IST

స్థానిక పంచాయతీ కార్మికులు మూడు నెలల జీతాలు ఇవ్వలేదని ఆదివారం మెరుపు సమ్మె నిర్వహించారు.

పారిశుధ్య కార్మికుల మెరుపు సమ్మె

రైల్వేకోడూరు, మే 2: స్థానిక పంచాయతీ కార్మికులు మూడు నెలల జీతాలు ఇవ్వలేదని ఆదివారం మెరుపు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రతి సారి సక్రమంగా జీతాలు చెల్లించడంలో పంచాయతీ వారు జాప్యం చేస్తున్నారన్నారు. పారిశుధ్య కార్మికులకు నెలకు రూ. 18000 చెల్లిస్తామని చెప్పి ఇంత వరకు అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికుల సంఘం అధ్యక్షుడు తేజ, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-03T04:55:58+05:30 IST