ఆ చిన్నారులకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-07-27T04:51:05+05:30 IST

పోరుమామిళ్ల పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల మరణించిన కానిస్టేబుల్‌ శివయ్య పిల్లలు చంద్రశేఖర్‌, చంద్రను పో లీసుశాఖ తరపున దత్తత తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

ఆ చిన్నారులకు అండగా ఉంటాం
పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న ఎస్పీ

దత్తత తీసుకుని చదువు, ఆర్థికసాయానికి భరోసా కల్పిస్తాం : ఎస్పీ


కడప (క్రైం), జూలై 26 : పోరుమామిళ్ల పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల మరణించిన కానిస్టేబుల్‌ శివయ్య పిల్లలు చంద్రశేఖర్‌, చంద్రను పో లీసుశాఖ తరపున దత్తత తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. కా నిస్టేబుల్‌ కొడుకు, కూతురును సోమవారం జిల్లా పోలీసు కార్యాయానికి పిలిపించిన ఎస్పీ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కానిస్టేబుల్‌ శివయ్య భార్య 9 సంవత్సరాల క్రితమే మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా ఉన్నట్లు గుర్తించిన ఎస్పీ వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువుతో పాటు వారు ఉన్నత స్థాయికి చేరేవరకు పోలీసు అధికారుల సంక్షేమ సంఘానికి బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. పిల్లలు పదో తరగతి పూర్తి చేసి ఖాళీగా ఉండడంతో వారిని బాగా చదవాలంటూ ఆయన ప్రోత్సహించారు. ఆర్‌ఐ వీరేష్‌, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, ఉపాధ్యక్షుడు శంకర్‌, కోఆప్షన్‌ మెంబరు రామక్రిష్ణ, కోశాధికారి గంగరాజులు వారికి అండగా ఉండాలని సూచించారు. దీంతో ఆ పిల్లలు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌, ఆర్‌ఐ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి : తమ సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు, సచివాలయాలకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను అధికారులు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ అన్బురాజన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఫిర్యాదుదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-07-27T04:51:05+05:30 IST